Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

సెల్వి
గురువారం, 16 మే 2024 (23:36 IST)
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అల్ఫారెట్టా, జార్జియాలో, మంగళవారం రాత్రి ఒకే వాహనం ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు. 
 
మాక్స్‌వెల్ రోడ్డు దాటి వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి చెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి వేగమే కారణమని అనుమానిస్తున్నారు. అల్ఫారెట్టా హైస్కూల్‌లో సీనియర్ అయిన ఆర్యన్ జోషి గ్రాడ్యుయేషన్‌కు కొద్ది రోజుల దూరంలో ఉన్నాడు. అతని ప్రిన్సిపాల్ మైక్ స్కీఫ్లీ విద్యార్థులు, తల్లిదండ్రులకు హృదయ విదారక వార్తను తెలియజేశారు. 
 
అలాగే శ్రీయ అవసరాల.. జార్జియా విశ్వవిద్యాలయంలో ఫ్రెష్‌మెన్ అయిన అన్వీ శర్మ తమ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడి ఆసుపత్రికి తరలించారు. 
 
ఇంకాడ్రైవర్, రిత్వాక్ సోమేపల్లి, జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి, అల్ఫారెట్టా హైలో సీనియర్ అయిన మహమ్మద్ లియాకత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులచే దర్యాప్తు జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments