Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృష్టమంటే ఇదీ.. లాటరీలో 2,888 కోట్ల జాక్‌పాట్‌, కాలిమీద కాలేసుకుని బతికేంత డబ్బు!

తంతే బూర్లగంపలో పడ్డాడు అనేది తెలుగు సామెత. తన్నాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో ఒక వ్యక్తి డబ్బుచెట్టుపై పోయి పడ్డాడు. కారణం బాహుబలి 2 వ్రపంచవ్యాప్త కలెక్షన్ల కంటే రెట్టింపు డబ్బు లాటరీ ద్వారా సొంతం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (03:15 IST)
తంతే బూర్లగంపలో పడ్డాడు అనేది తెలుగు సామెత. తన్నాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో ఒక వ్యక్తి డబ్బుచెట్టుపై పోయి పడ్డాడు.  కారణం బాహుబలి 2 వ్రపంచవ్యాప్త కలెక్షన్ల కంటే రెట్టింపు డబ్బు లాటరీ ద్వారా సొంతం కావడమే. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తిన్నా తరగనంత ఆస్తి అతడిని వరించింది మరి.
 
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.2,888 కోట్లు (448 మిలియన్‌ డాలర్లు) గెలిచారు. ఇందులో నుంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేయనున్నారు.
 
అమెరికన్ లాటరీ సంస్థ పవర్‌బాల్‌ కంపెనీ ఈ లాటరీని నిర్వహించింది. ఇంత అదృష్టం ఎవరిని వరించిందనేది మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని ఓ దుకాణంలో ఈ బంపర్‌ టికెట్‌ అమ్ముడైనట్లు లాటరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 
 
లాటరీ టికెట్‌ అమ్మిన దుకాణం యజమానికి కూడా దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలను పవర్‌బాల్‌ అందజేయనుంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments