Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్వలో బోల్తాపడిన బస్సు - 17 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (16:54 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని సోనాదంగా నుంచి ఆ దేశ రాజధాని ఢాకాకు 40 మంది ప్రయాణికులతో కలిసి ఆదివారం ఉదయం ఒక బస్సు బయలుదేరింది. ఇది మమదరిపూర్ అనే ఏరియాలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించాల్సివుంది.
 
మరోవైపు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం, బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు  భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments