Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 12 మంది మృతి

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (16:35 IST)
Nepal
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసకూలీలతో వెళ్తున్న ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది కార్మికులు ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల బరేచ్‌ జిల్లాకు వలస వచ్చారు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో వీరంతా ఓ ప్రైవేటు వాహనంలో స్వస్థలానికి పయనమయ్యారు.
 
అయితే ఆదివారం అర్ధరాత్రి నేపాల్‌లోని బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడిక్కడే మరణించారు. గాయపడిన వారిని నేపాల్‌గంజ్ నగరంలోని భేరి ఆసుపత్రికి తరలించారు అని బాంకే జిల్లా అధికారి రాంబహాదూర్ కురుంగ్వాంగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments