Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై భారత్-పాక్ చర్చలు ప్రారంభం!

Webdunia
నీటి వివాదాల పరిష్కారానికి గానూ భారత్, పాకిస్థాన్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగే చర్చలు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా ఊలార్ బ్యారేజ్-తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ వివాదం గురించి చర్చించనున్నారు.

చర్చల్లో పాల్గొనేందుకు గానూ నీటి వనరుల కార్యదర్శి ధృవ్ విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత అధికారుల బృందం గత రాత్రి పాకిస్థాన్ చేరుకుంది. సింధూ జలాల కమీషనర్ జీ రంగనాథన్ కూడా ఈ బృందంలో సభ్యుడు. పాకిస్థాన్ బృందానికి వాటర్ అండ్ పవర్ సెక్రటరీ జావెద్ ఇక్బల్ సారధ్యం వహిస్తున్నారు.

జమ్ము, కాశ్మీర్‌లోని తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై పాకిస్థాన్ చేస్తున్న అభ్యంతరాలపై ఇరు దేశాల అధికారులు చర్చించనున్నారు. భారత్ ఈ ప్రాజెక్ట్‌ను 1985లో ప్రారంభించింది. 1960లో భారత్, పాక్‌ల మధ్య చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘిస్తున్నదని పాకిస్థాన్ పిర్యాదు చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments