Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షయానం చేయనున్న సునీతా విలియమ్స్

Webdunia
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్‌ మరో మారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. 2006వ సంవత్సరంలో ఆరు నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో పనిచేసిన సునీత విలియమ్‌ వ్యోమగామిగా గతంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జులై నెలలో మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. కజక్‌స్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి జులై 14వ తేదీన విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర ప్రారంభమవుతుంది. రష్యన్‌ ఫెడరల్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్‌ యూరి మాలెన్కెక్‌, జపాన్‌ ఎరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్‌ అఖికో హోషైడ్‌లతో కలిసి విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర చేపడుతున్నారని నాసా తెలిపింది.

విలియమ్స్‌ 1998లో ఒక వ్యోమగామిగా నాసా ఎంపికచేసింది. విలియమ్స్‌ తండ్రి గుజరాత్‌కు చెందిన వారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు చెందిన అన్వేషణ-14లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత అన్వేషణ-15లో పాలుపంచుకున్నారు. మహిళా అంతరిక్ష ప్రయాణికులలో సుదీర్ఘకాలం అంతరిక్షంలో ప్రయాణం చేసిన మహిళగా విలియమ్స్‌ రికార్డు సాధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments