Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోఫాసెట్ కొంటున్నారా..? కాస్త ఆగండి!!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:56 IST)
అందంగా నిర్మించుకున్న ప్రతి ఇంటి డ్రాయింగ్ రూముల్లోనూ సోఫాసెట్ ఇప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. ఇంటికి కావాల్సిన ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. వస్తువుల పైపై మెరుగులను చూసి కొనేయడం. మనం డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమని భావిస్తామో, వాటి నాణ్యత కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని ఆయా సందర్భాల్లో మర్చిపోతుంటారు.
 
కాబట్టి, మీకు ఎంతో నచ్చిన సోఫాసెట్ మోడల్ ఎంచుకున్న మరుక్షణమే డబ్బు చెల్లించటం మానేసి కాసేపు దాని నాణ్యత గురించి ఆలోచించండి. అక్కడే వాటి నాణ్యత ఎలా తెలుస్తుంది, కొన్ని రోజులు వాడితేనే కదా..! అని అంటారేమో...! కింది జాగ్రత్తలను తీసుకున్నట్లయితే సోఫాల నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా...
 
మీరు ఎంపిక చేసుకున్న సోఫాసెట్‌పైన కనీసం పది నిమిషాలపాటు కూర్చోండి. అలా చేయడం వల్ల అది సౌకర్యంగా ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా... మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగులుతోందా అనేది నిశితంగా పరిశీలించండి. 
 
ఇక సోఫా‌పై ఊరికే కూర్చోక కాసేపు అటూ, ఇటూ కదలండి. ఇలా చేయడం వల్ల మనం కదలినప్పుడు సోఫా కీచుమనే శబ్దం లాంటిదేదైనా చేస్తుందేమో తెలిసిపోతుంది. ఇకపోతే అది కీచుమని శబ్దం రాకుండా ఉన్నట్లయితేనే సరిగా ఉన్నట్లు, లేకుంటా అలాంటి దానిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 
 
ఇలా చేసి చూడండి..!
అలాగే సోఫా వెనుక వైపున ఉండే బ్యాక్‌రెస్ట్.. మీ నడుం కింది భాగానికి దన్నుగా, హాయినిచ్చేదిగా ఉండాలి. కాళ్ళు నేలమీద ఆని సౌకర్యంగా కూర్చున్నట్లు... దానిపై కూర్చున్నవారికీ, చూస్తున్నవారికీ అనిపించాలి. కూర్చున్నప్పుడు సోఫా సీటు లోపలికి వెళ్తుంది కదా...! అలా వెళ్ళడం పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదన్న విషయాన్ని గమనించండి. 
 
అతుకుల్లాంటివి ఉన్నచోట కాస్త జాగ్రత్తగా గమనించాలి. కుట్లు పటిష్టంగా ఉందీ లేనిదీ చూసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా సోఫా‌సెట్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే బ్రోచర్‌ను తీసుకోవడం మాత్రం మరువవద్దు. 
 
చివరిగా మరో ముఖ్య విషయం ఏంటంటే... అసలు మీరు ఎంపిక చేసుకున్న సోఫా మీ హాలులో ఎక్కడ వేయాలో, అక్కడ అది పడుతుందో, లేదో చూసుకోవాలి. అలాగే సోఫా‌సెట్‌ను మీ గది గుమ్మంలోంచి లోపలికి తీసుకెళ్ళడం వీలవుతుందో, లేదో... దాని రంగు మీ ఇతర ఫర్నీచర్లకు సూటవుతుందో, లేదో తదితర విషయాలన్నింటీ క్షుణ్ణంగా గమనించి కొనుగోలు చేసుకుంటే మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments