Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూల మొక్కల్ని ఎలా పెంచుకోవాలి.. ఈ టిప్స్ పాటించండి.

సాధారణంగా మనం పూలచెట్లను అందం, పరిమళం కోసం పెంచుతుంటాం. ఇంటిముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న మోస్తరు పూదోటను పెంచితే, ఫ్లాట్స్‌లో నివశించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పుష్పాలను ప

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (15:36 IST)
సాధారణంగా మనం పూలచెట్లను అందం, పరిమళం కోసం పెంచుతుంటాం. ఇంటిముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న మోస్తరు పూదోటను పెంచితే, ఫ్లాట్స్‌లో నివశించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పుష్పాలను పూయిస్తారు. రకరకాల రంగులతో పుష్పించే ఆ పుష్పాలలో కొన్నింటిని జడలో తురుముకుని మురిసిపోయే స్త్రీలు, మిగిలిన పూలను ఇదివరకిటిలా అలా వాటిని వదలివేయక తమ ఇంట్లో అలంకరించి, ఇంటికి కొత్త అందాలను చేకూర్చే ప్రయత్నం చేస్తుంటారు. 
 
కన్నులకింపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే... అలా పుష్పించిన ఫ్లవర్ వేజ్‌లో చూపులను ఆకట్టుకునేట్లు అలంకరించటం ఓ కళ. పూలతో ఇంటిని అలంకరించాలనుకోవాలనుకుంటే మొదటగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం. 
 
పుష్పించే మొక్కలను గమనించినప్పుడు, కొన్ని ఓ ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే... కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే, మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి. అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పుష్పించే మొక్కల పెరుగుదల ఉంటుంది. 
 
పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎండాకాలంలో పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ... వానాకాలంలో పుష్పించే టైగర్ లిల్లీ, వెరోనికా... చలికాలంలో పుష్పించే బంతి, డిసెంబరు పూలు, నందివర్థనం, రోజ్ మేరీ వంటి పుష్పాలను పెంచటం వల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments