డస్ట్ బిన్‌ శుభ్రతకు ఈ చిట్కాలు పాటించండి!

Webdunia
గురువారం, 12 జూన్ 2014 (17:23 IST)
డస్ట్ బిన్‌ల శుభ్రత చాలా అవసరం. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్‌లలో ఉపయోగించే డస్ట్ బిన్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దీనికోసం కొన్ని పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. చెత్తబుట్టులో దుర్వాసన నివారించడానికి డస్ట్ బిన్‌కు కవర్ తొడగడానికి ముందుగా నేఫ్తలిన్ బాల్స్‌ను వేయాలి. నేఫ్తలీన్ బాల్స్ చాలా గాఢమైన వాసనను కలిగి ఉండి, చెడిన పదార్థాల మీద వ్యాప్తి చెందుతుంది. అందువల్ల మీరు రెగ్యులర్‌గా డస్ట్ బిన్ కవర్స్‌ను ఉపయోగిస్తున్నట్లైతే, ఈ నేఫ్తలిన్ బాల్స్ వేసి ఒక వారం పాటు ఉంచవచ్చు. వారంలో ఒకటి లేదా రెండు సార్లు డస్ట్ బిన్ శుభ్రం చేసి, నేఫ్తలీన్ బాల్స్‌ను మార్చుతుండాలి. 
 
డస్ట్ బిన్‌ను బేకింగ్ సోడాతో వాష్ చేయడం వల్ల వంటగది పరిశుభ్రత మరియు దుర్వాసనను నివారించడానికి ఒక ఉత్తమ మార్గం. ఇంకా మీరు డస్ట్ బిన్ చుట్టూ బేకింగ్ సోడాను చిలకరించవచ్చు. ఇది డస్ట్ బిన్ చుట్టూ ఉన్న వాసనను బేకింగ్ సోడా గ్రహిస్తుంది. బేకింగ్ సోడాను డస్ట్ బిన్‌లో చిలరించడం వల్ల దుర్వాసన నివారించడంతో పాటు, డస్ట్ బిన్ మరకలను చాలా తేలికగా నివారిస్తుంది.
 
కిచెన్ డస్ట్ బిన్‌లో డ్రైయ్యర్ షీట్స్ అమర్చడం వల్ల చెత్త చెదారం డస్ట్ బిన్‌కు అతుక్కోకుండా ఉంటుంది. డస్ట్ బిన్ నుండి ఇంట్లో వాసన వస్తుంటే, వెంటనే ఆర్గానిక్ లేదా నేచురల్ ఫ్రెష్నర్స్‌ను ఉపయోగించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

Show comments