ఇంటి ముందు పూల మొక్కలను పెంచుతున్నారా...?

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (15:56 IST)
సాధారణంగా మనం పూలచెట్లను అందం, పరిమళం కోసం పెంచుతుంటాం. ఇంటిముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న మోస్తరు పూదోటను పెంచితే, ఫ్లాట్స్‌లో నివశించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పుష్పాలను పూయిస్తారు. రకరకాల రంగులతో పుష్పించే ఆ పుష్పాలలో కొన్నింటిని జడలో తురుముకుని మురిసిపోయే స్త్రీలు, మిగిలిన పూలను ఇదివరకిటిలా అలా వాటిని వదలివేయక తమ ఇంట్లో అలంకరించి, ఇంటికి కొత్త అందాలను చేకూర్చే ప్రయత్నం చేస్తుంటారు. 
 
కన్నులకింపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే... అలా పుష్పించిన ఫ్లవర్ వేజ్‌లో చూపులను ఆకట్టుకునేట్లు అలంకరించటం ఓ కళ. పూలతో ఇంటిని అలంకరించాలనుకోవాలనుకుంటే మొదటగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం. 
 
పుష్పించే మొక్కలను గమనించినప్పుడు, కొన్ని ఓ ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే... కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే, మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి. అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పుష్పించే మొక్కల పెరుగుదల ఉంటుంది. 
 
పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎండాకాలంలో పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ... వానాకాలంలో పుష్పించే టైగర్ లిల్లీ, వెరోనికా... చలికాలంలో పుష్పించే బంతి, డిసెంబరు పూలు, నందివర్థనం, రోజ్ మేరీ వంటి పుష్పాలను పెంచటం వల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం

Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి

Guntur: టీడీపీ ఎమ్మెల్యే, మేయర్‌ల మధ్య కోల్డ్ వార్

Amaravati: అమరావతి రాజధాని భూ సమీకరణ రెండో దశ ప్రారంభం

Krishna River: కృష్ణానదిపై రూ.816 కోట్లతో అద్దాల వంతెన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Show comments