Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందుకు వెళుతున్నారా.. అయితే ఇవి పాటిస్తున్నారా..?!

Webdunia
FILE
* విందుకు ఆహ్వానించినప్పుడు సమయానికి వెళ్లడం సరైన పద్ధతి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆలస్యంగా వెళ్లాల్సి వస్తే ముందుగా విషయం వారికి తెలపాలి. లేదంటే మీకోసం వారు ఎదురు చూడటం అంతగా బావుండదు. విందుకు వెళుతున్నాం కదా అని మరీ ముదురు రంగులు, అతిగా తళుకులీనే దుస్తులు, జర్కిన్‌, కోటు వంటివి అతిగా ధరిస్తే చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి.. చూడగానే ఆకట్టుకొనే రంగులు, అందంగా, హుందాగా ఉండే దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం.

* హోటల్ టేబుళ్లపై నాప్‌కిన్‌, ప్లేట్లు, గ్లాసులు, కట్లెరీ సామగ్రి పొందిగ్గా అమర్చి ఉంచుతారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ముందుగానే తెలుసుకొని వెళ్లాలి. లేకపోతే ఇతరుల ముందు అబాసుపాలు కావల్సివస్తుంది. భోజనం వడ్డించడం ఆలస్యమైతే టేబుల్‌ పై చేతులు పెట్టడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం చేయకూడదు. నిటారుగా, హుందాగా కూర్చొని మాట్లాడాలి.

* ఒక్కోసారి మీ అభిరుచికి తగినట్లు పదార్థాలను ఆర్డర్‌ చేయమంటారు మీ స్నేహితులు. అలాంటప్పుడు మీకు నచ్చినవన్ని జాబితాలో చూసి చెప్పండి. అలాగే అన్ని పదార్థాలను ఒకేసారి ప్లేటులో వడ్డించుకోకుండా ఒక్కోటి చొప్పున నెమ్మదిగా ఆరగించాలి. అంతేకాదు.. ఈ సమయంలో వెయిటర్‌, వెయిట్రస్‌లను మర్యాద పూర్వకంగా పిలవడమనేది వారి వారి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.

* విందుకు వెళ్లినప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడటం ఎదుటివారికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకని రెస్టారెంట్‌లో ఉన్నంతసేపు సెల్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయటం మేలు. మీతోపాటు పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తే, అక్కడ ఎలా నడుచుకోవాలో వారికి ముందుగానే వివరించి చెప్పాలి. లేదంటే, వారు చేసే అల్లరి మీ సంభాషణకు ఆటంకం కలిగించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments