Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ స్పెషల్ మిక్స్‌డ్ చాక్లెట్ డ్రైఫూట్ కేక్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (15:41 IST)
క్రిస్మస్ వచ్చిందంటే అందరి ఇంట్లో కేక్‌‌ల సందడి మొదలైనట్లే. క్రిస్మస్ పండుగకు ఎంత ముఖ్యత్వముందో కేక్‌లకు అంతే ముఖ్యత్వం ఉంది. అలాంటి కేకు తయారీవిధానం గురించి తెలుసుకుందాం! 
 
కావలసిన పదార్థాలు :
 
బటర్: 150 గ్రాములు
మైదాపిండి:100 గ్రాములు
ఎండు ద్రాక్ష: 20
బాదం పప్పు : 20
పిస్తా పప్పు : 20
జీడి పప్పు : 20
బేకింగ్ పౌడర్: 1/2 స్పూన్
చాక్లెట్ ఎసెన్స్: 1/2 స్పూన్
చక్కెర పొడి: 150  గ్రాములు
గుడ్డు: 3
పాలు: 1 కప్పు
 
తయారీ విధానం :
 
మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి. చక్కెరను కూడా పౌడర్‌ చేసుకోవాలి
తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత 3 గుడ్లను బ్లెండర్‌తో బీట్ చేసుకుని దీంట్లో చాక్లెట్ ఎసెన్స్‌ను కూడా వేసి బాగా కలపాలి. 
తర్వాత ఈ మిశ్రమానికి  ఎండు ద్రాక్షను, జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుచేర్చి, మైదాను కూడా కలిపి, ఒక కప్పు పాలు పోసి పిండి చిక్కగా కాకుండా జారుగా ఉండేట్లు కలుపుకోవాలి. కేక్ ట్రేలో కొద్దిగా వెన్నెపూసి జారుగా కలుపుకున్నమిశ్రమాన్నిపోసి 
500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు అవెన్‌లో బేక్ చేయాలి. అంతే మిక్స్‌డ్ చాక్లెట్ డ్రైఫూట్ కేక్ రెడీ. గార్నిషింగ్ కి కావాలంటే చెర్రీ పండ్లు వాడుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments