తయారీచేయండి ఇలా: మొదట చేపముక్కలు కడిగి పసుపు, ఉప్పు పట్టించాలి. మరోవైపు ఉల్లి, పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కోయాలి. మసాలా దినుసులు, పాలకూర మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
పాలకూర మసాలా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు వేసి కాస్త ఉడికాక చేపముక్కలు వేసి మరికాస్త పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి ఓ సారి గిన్నెను తిప్పి నీరంతా ఇగిరేవరకూ తక్కువ మంటమీద ఉడికించాలి. మంచివాసన రాగానే కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే గ్రీన్ ఫిష్ మసాలా రెడీ...! ఇందులో అటు ఆకు కూర పోషకాలు, ఇటు చేపల పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. రుచి రుచి... శక్తికి శక్తినూ.