సమ్మర్ స్పెషల్ : హెల్తీ కర్డ్ రైస్ ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2016 (09:41 IST)
పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ వేసవిలో మజ్జిగ, పెరుగన్నం వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాంటి పెరుగుతో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చితో తయారు చేసుకుని పండ్లు కూడా చేర్చుకుంటే హెల్తీ కర్డ్ రైస్ రెడీ అయినట్లే.. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు: 
ఉడికించిన రైస్ : రెండు కప్పులు 
పెరుగు : రెండు కప్పులు 
పాలు : రెండు కప్పులు 
నచ్చిన ఫ్రూట్స్ : ఒక కప్పు 
షుగర్ : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత 
కొత్తిమీర, కరివేపాకు తరుగు: ఒక టీ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర : పోపుకు తగినంత 
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు 
బాదం తరుగు : పావు కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా ఉడికించిన రైస్‌కు చిటికెడు ఉప్పు.. పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మెదపాలి. అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు, బాదం తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. కావాలంటే క్యారెట్ తురుము కూడా చేర్చుకోవచ్చు. అంతే రుచికరమైన హెల్తీ కర్డ్ రైస్ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 20మంది సేఫ్

చంద్రబాబు కోసం బండ్ల గణేష్ పాదయాత్ర.. కాలినొప్పి.. పరామర్శించిన లోకేష్

సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?

చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

Lokesh Kanagaraj: రజనీకాంత్-కమల్ హాసన్ చిత్రాల నుంచి తప్పుకోవడానికి కారణమదే: లోకేష్ కనగరాజ్

Mahesh Babu: ప్రియాంక చోప్రా నటనను ప్రశంసించిన మహేష్ బాబు

Manchu Manoj: రూత్ లెస్, బ్రూటల్ గా డేవిడ్ రెడ్డి లో మంచు మనోజ్

Show comments