Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బీట్‌రూట్ పాయసం" తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (17:52 IST)
బీట్‌రూట్ పాయసం 
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్ తురుము... ఒక కప్పు
రాగిపిండి... అర కప్పు
సేమ్యా... పావు కప్పు
సగ్గుబియ్యం... పావు కప్పు
పంచదార... ఒక కప్పు
కొబ్బరితురుము... అర కప్పు
కాచినపాలు... అర లీటరు
వేయించిన జీడిపప్పులు... పది
బాదం... పది
కిస్‌మిస్... పది
యాలకుల పొడి... పావు టీ స్పీన్
నెయ్యి... రెండు టీ స్పూన్
నీళ్లు... రెండు కప్పులు
 
తయారీ విధానం :
సేమ్యాను, సగ్గు బియ్యాన్ని విడివిడిగా దోరగా వేయించాలి. దళసరి అడుగున్న వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి అవి మరిగాక సేమ్యా, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు తురిమిన బీట్‌రూట్‌ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రాగిపిండిని జతచేసి కొద్దిగా నీరుపోసి ఉండలు లేకుండా చూసి, ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి అడుగంటకుండా తిప్పి పంచదార వేసి కలపాలి.
 
పాయసం చిక్కబడ్డాక యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లు వేసి దించేయాలి. పాయసం వేడి తగ్గి గది ఉష్ణోగ్రతకు వచ్చాక కాచి చల్లార్చిన పాలను అందులో కలిపి సర్వ్ చేయాలి. చూసేందుకు పింక్ కలర్లో అందంగా కనిపించే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మంచి రక్తపుష్టిని కూడా కలిగిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉక్రెయిన్‌ సంఘర్షణపై శ్రద్ధ.. ప్రధాని మోదీతో పాటు ప్రపంచ నాయకలకు పుతిన్ థ్యాంక్స్

Heart Attack: గుండెపోటును నివారించే టీకాను అభివృద్ధి చేసిన చైనా

వైఎస్ వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భద్రత పెంపు!!

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం .. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది (Video)

రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటా : యనమల రామకృష్ణుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

Show comments