Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైప్ టూ డయాబెటిస్‌ను దూరం చేసే చిల్లీ పన్నీర్ ఎలా చేయాలి?

పనీర్ టైప్ టూ డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. ఒబిసిటీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. బరువును తగ్గించే పనీర్‌‌లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు ఎంతో మేలు చేసే పనీర్‌తో చిల్లీ పనీర్ తయారు చేయడం మీక

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:27 IST)
పనీర్ టైప్ టూ డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. ఒబిసిటీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. బరువును తగ్గించే పనీర్‌‌లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు ఎంతో మేలు చేసే పనీర్‌తో చిల్లీ పనీర్ తయారు చేయడం మీకు తెలుసా అయితే ఇదిగోండి తయారీ విధానం ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు :
 
‌పనీర్‌ - 200 గ్రాములు  
పచ్చిమిర్చి - ఆరు
‌కోడి గుడ్డు - రెండు. 
‌చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను. 
‌నూనె - వేయించడానికి తగినంత. 
‌సన్నగా తరిగిన వెల్లుల్లి - ‌ఒక టేబుల్‌ స్పూను 
మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు. 
కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌ స్పూను 
ఉప్పు - అర టీ స్పూను. 
‌అజనొమోటో - అర టీ స్పూను. 
 
తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను ఫ్రిజ్ నుంచి తీసి కాసేపయ్యాక పనీర్‌ను డైమండ్‌ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. వీటి మిశ్రమం పనీర్‌ ముక్కలకు కోటింగ్‌గా పట్టేస్తుంది. ఇలా కలిపిన వెంటనే నూనె వేడిచేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి. 
 
బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి వేసి వేగిన తరువాత రెండు టీ స్పూన్ల నీళ్లు, ఉప్పు, అజనొమోటో, చిల్లీ సాస్‌ వేసి అన్నింటినీ దోరగా వేపుకున్న తర్వాత వేయించి వుంచిన పనీర్ ముక్కల్ని అందులో కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. ఈ చిల్లీ పన్నీర్‌ను పిల్లలకు రోటీలకు గార్నిష్‌తో సర్వ్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments