Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? (video)

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (13:54 IST)
ప్రస్తుతం మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తోంది. వచ్చే 2050 నాటికి భారత్‌లో 60 కోట్ల మంది మధుమేహ రోగులు ఉంటారని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలిని మార్చుకుని ముందుకుసాగినట్టయితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఒకసారి ఈ వ్యాధిబారినపడితే చక్కెర రోగగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశాన్ని తెలుసుకుందాం. 
 
* ముందుగా అన్నం, గోధుమలు, మైదా, చక్కెర నిలిపి వేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
* ప్రతి రోజు రాగిజావలో మజ్జిగ పోసుకొని త్రాగుతుంటే మధుమేహం తగ్గుతుంది. 
* మొలకెత్తిన మెంతుల పొడిని, ప్రతి రోజు రెండు పూటలు ఒక చెంచా చొప్పున సేవిస్తుంటే మధుమేహం తగ్గుతుంది.
* ప్రతీ రోజు ఉదయాన్నే గ్లాసు నీటిలో గుప్పెడు కొత్తిమీరకాడలతో సహా వేసి 3-4 నిమిషాలు ఉడకబెట్టి, వడగట్టి గోరువెచ్చగా త్రాగాలి.
 
* 1.5 గంటలు నడక, జాగింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం తప్పనిసరి.
 
మధుమేహ రోగులు తినకూడని ఆహార పదార్థాలు. (బంగాళాదుంపలు, కంద వంటి మూల కూరగాయలు, మామిడి పండ్లు, అరటి కాయ)
తినాల్సినవి (ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ, జామకాయ, పియర్, కివి, బొప్పాయి)
 
* అలాగే, చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి. అంటే ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు వంటి తినాలి.
* చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకుని ఆరగించవచ్చు. రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసుకోవాలి. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments