Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తింటే ఏంటి ఫలితం?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (15:04 IST)
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం, జీవక్రియ అసమతుల్యత పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
 
సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిదని భావిస్తారు.
సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తాయి. ఇది జీర్ణ వాహిక నుండి గ్యాస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
 
అసిడిటీ- గుండెల్లో మంట చికిత్సలో సబ్జా గింజలు శరీరంలో హెచ్‌సిఎల్ యొక్క ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరించడంలో సహాయపడతాయి. నీటిలో నానబెట్టిన విత్తనాలను తినడం వల్ల కడుపు ప్రశాంతంగానూ, కడుపులో మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments