Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో కప్పు పెరుగు తినండి.. కాస్తంత స్లిమ్‌గా ఉండండి!!

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (14:56 IST)
చాలా మంది యువతీ యువకులు ముఖ్యంగా యువతులు స్లిమ్‌గా ఉండేందుకు రకరకాల ఆహార నియమాలను పాటిస్తుంటారు. అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును, బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్‌గా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. 
 
200 గ్రాముల పెరుగులో దాదాపు 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందని పరిశోధనలో వెల్లడైనట్లు వారు తెలిపారు. క్యాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్‌గా వుండడానికి దోహదపడుతుంది. మన శరీరానికి కావాల్సినంత క్యాల్షియం తీసుకోకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయేది కడుపులోనేనన్నవిషయం తెలిసిందే. 
 
అంతేకాకుండా పెరుగు లేప్టీన్ అనే హార్మోన్‌ను పెంపొందిస్తుంది. ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. పెరుగులోనున్న కాసిన్ని ప్రొటీన్లుకూడా భోజనం చేసామన్న తృప్తినిస్తుంది. పెరుగు తీసుకుంటే ఇతరత్రా చిరుతిండ్ల జోలికి పోరంటున్నారు పరిశోధకులు. చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా బొజ్జపెరిగి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి శరీరాకృతిని కాపాడుకోవాలనుకుంటే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments