Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట కొవ్వు పెరిగిందా... తగ్గేందుకు ఇవి వాడుతుంటే...

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (21:32 IST)
పొట్ట వద్ద కొవ్వు పేరుకునిపోయి పొట్టలావుగా వుండి చాలా ఇబ్బంది పడుతుంటారు కొందరు. వ్యాయామం చేయకపోవడం, పొద్దస్తమానం కూర్చుని పనిచేయడం వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది.


ఒక్కసారి పేరుకున్నదంటే దాన్ని వదిలించుకోవడం కష్టమైన పనే. ఐతే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని వ్యాయామం చేస్తుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే అవకాశం వుంది. ఈ క్రింది వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం వుంటుందంటున్నారు.

 
క్యారెట్లు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించగలవు. ఇవి కేలరీలను బర్న్ చేస్తాయి. జీవక్రియను మెరుగుపరిచి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా క్యారెట్ తింటే ఫలితం వుంటుంది. బ్రోకలీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి,క్రోమియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలోని కొవ్వుల జీవక్రియ విటమిన్ సి ద్వారా సక్రియం చేయబడుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.

 
బచ్చలికూరను సలాడ్‌గా ఉపయోగిస్తే, అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బచ్చలికూర తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఎర్ర మిరపకాయలను రుచికరమైన వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో సోడియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, షుగర్, ప్రొటీన్, విటమిన్-సి వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఈ కారం తింటే పొట్ట తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments