Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్కతో బ్లాక్ హెడ్స్‌కు ఫుల్‌స్టాఫ్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (13:17 IST)
ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్)కు దాల్చిన చెక్కలతో ఫుల్‌స్టాఫ్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాల్చిన చెక్కను పొడి చేసి దానిలో తేనెను కలపాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు నల్లమచ్చలపై రాయాలి. ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా పోతాయి. ఇదే పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపితే ముఖంపై ఉండే మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయని పెరటి వైద్యులు చెపుతున్నారు. 
 
సాధారణంగా శరీరంపై ఏర్పడే గాయాలకు మందుగా పసుపును వాడుతుంటాం. పసుపు బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. పసుపును రెండు స్పూన్ల పుదీనా రసంలో కలిపి పేస్ట్ లా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి. పేస్ట్ ఆరిపోయిన తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజులు చేస్తే మచ్చలు పోతాయి.
 
కాగా, ముఖంపై ఏర్పడే నల్లమచ్చలు (బ్లాక్ హెడ్స్) చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులకైతే ఈ తరహా సమస్యలు వేధిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మొటిమలు ఏర్పడ్డాక... ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి వీటిని ఎలా తొలగించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు కూడా. ఇలాంటి వారి ఈ తరహా పెరటి వైద్యంతో ఉపశమనం పొందొచ్చు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments