Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షయకు ఒకే మందు అవిశాకు...

ఆకు కూరలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ ఎన్నోసార్లు వైద్యులు మనకు చెబుతుంటారు. వైద్యులే కాదు మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కూడా ఇదే చెబుతారు. ప్రతిరోజు ఆహారంలో తూచా తప్పకుండా ఆకుకూరలు తినాలని చెబుతుం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:47 IST)
ఆకు కూరలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ ఎన్నోసార్లు వైద్యులు మనకు చెబుతుంటారు. వైద్యులే కాదు మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కూడా ఇదే చెబుతారు. ప్రతిరోజు ఆహారంలో తూచా తప్పకుండా ఆకుకూరలు తినాలని చెబుతుంటారు. కానీ ఇప్పటికీ చాలామంది పాటించరు. అసలు ఆకుకూరల్లో అవిశాకు ఎంతో మంచిదని చాలా చెబుతారు. అసలు అవిశాకు వల్ల కలిగే లాభం ఏంటో తెలుసుకుందాం..
 
అవిశాకు మునగచెట్టును పోలి ఉంటుంది. దీనికి కొమ్మలుండవు. చెట్టు నిలువుగా పెరుగుతుంది. పూత తెల్లగా ఉండి చిక్కుడు పూతను పోలి ఉంటుంది. కాయలు అలచందకాయల వలె పొడవుగా ఉంటుంది. ఆకులు, చింతాకుల ఆకారం కలిగి ఉంటుంది. మంచి వైద్య గుణాలు కలిగిన వృక్షమిది.
 
క్షయను ఆంగ్లంలో టి.బి. అని, దగ్గు అని పిలుస్తారు. క్షయ త్వరగా నయంకాదు. ఈ జబ్బులు గల వారు డాక్టరిచ్చే మందులు వాడుకుంటూ అవిశాకు రసాన్నివడపోసి వాటిని మూడుమూటలా స్ఫూను చొప్పున రోజుకు రెండు లేక మూడుసార్లు తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
 
అంతేకాదు అవిశాకు రసం తేనె కలిపి రోజుకు రెండు మూడుసార్లు ఒక స్ఫూను తాగితే మామూలు దగ్గు వెంటనే తగ్గుతుంది. కొందరికి వేడిచేసి కళ్లు ఎరుపెక్కి మిక్కిలి బాధపడుతుంటారు. అలాంటప్పుడు అవిశపూలు మెత్తగా నూరి రసందీసి 3-4 చుక్కలు రాత్రి పడుకునే ముందు కళ్లలో వేస్తే రెండు మూడు రోజుల్లోనే అద్భుతమైన గుణమిస్తుంది. 
 
అవిశాకులో మేహాన్ని శాంతింపజేసే గుణముంది. దీని ఆకును, పూలనూ సమభాగాల్లో తీసుకొని పప్పులో వేసి ఆహారంలో తీసుకుంటే రేచీకటి, స్త్రీలకు ఏర్పడే బట్టంటు బజ్బు, తెల్లబట్ట, గనేరియా, సెగరోగాలు నశించిపోతాయి.
 
క్రమం తప్పకుండా అవిశాకు కూరను 15రోజులు ఆహారంగా వాడితే కడుపుతో క్రిములు నశిస్తాయి. వేడి వల్ల విరేచనంలో స్రవించే రక్తపు జీర తగ్గుతుంది. అలాగే అవిశాకును మొత్తగా నూరి, తేలు, ఎలుక, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు పైన పట్టుగా వేస్తే విషం వెంటనే హరిస్తుంది. దెబ్బలు తగిలి శరీర అవయవాలు వాచినప్పుడు ఆకునే నూరి పట్టు వేస్తే వాపులకు అద్భుతంగా పనిచేస్తుంది.
 
అవిశాకు రసాన్ని రోజు మార్చి రోజు రెండు మూడు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేస్తుంటే దగ్గు, జలుబు, నెమ్ము శీఘ్రకాలంలో తగ్గిపోతాయి. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments