Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి తింటే జిమ్ చేసిన‌ట్లే, యంగ్‌గా ఉంటారు.. ఏం చేయాలి...?

వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (18:17 IST)
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మ‌లు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం. 
 
అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.
 
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
 
ప‌చ్చి వెల్లుల్లి గుండెను కాపాడ‌తుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments