Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగ నిరోధకశక్తిని పెంచే రాగులు

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:53 IST)
చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. మన తాతలు, అవ్వలు రాగులను ఆహారంగా తీసుకోవడం వలనే పటిష్టంగా ఉండేవారని కొందరు పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. 
 
రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఫిట్‌గా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. రాగులలో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇవి ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి.
 
ఎసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారికి రాగి జావ అధ్బుత ఔషధం. వేసవిలో ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. రాగులలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు. గ్లూటిన్ సమస్యతో బాధపడుతున్నవారికి రాగులు చాలా మంచి ఆహారం. బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి. రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో దోహదపడతాయి. 
 
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి వారు రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. ఇంకా డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి.
 
ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు కూడా రాగులతో వాటిని నయం చేసుకోవచ్చు. అయితే వర్షా కాలంలో, శీతకాలంలో మాత్రం మోతాదుకు మించి వీటిని తీసుకుంటే అతిశీతలం చేసి జలుబు, అజీర్ణం సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ రెండు కాలాల్లో రాగులను కాస్తంత దూరం పెడితే మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments