Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినకూడని ఆహార కాంబినేషన్లు....

చాలా మంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన కాంబినేషన్లు కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:31 IST)
చాలా మంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన కాంబినేషన్లు కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా.. క్రమేణా విషతుల్యమయ్యే ప్రమాదం లేకపోలేదని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి డేంజర్ కాంబినేషన్లు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
మాంసం - పాలు: పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తినకూడదు. 
పెరుగు - పండ్లు: పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి
పుచ్చకాయ - నీళ్లు: పుచ్చకాయలో దాదాపు 95 శాతం మేరకు నీరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే.. శరీరంలోని జీర్ణ రసాలపై దుష్ప్రభావం చూపుతుంది.
టీ - పెరుగు: ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత దెబ్బతింటుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. 
పాలు - అరటి పండు: ఆయుర్వేద నిపుణులు పూర్తిగా వ్యతిరేకించే కాంబినేషన్ ఇదే. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. 
పాలు - నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments