మొటిమలకు కరివేపాకు వైద్యం..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (18:31 IST)
ఇంట్లో చేసే ఏ వంట అయినా కరివేపాకు లేకుంటే అది సంపూర్ణమైన రుచి కలిగి ఉండదు. ఇంటింట ప్రతి వంటకూ కరివేపాకు తప్పనిసరిగా వాడుతారు. కరివేపాకులో రుచి మాత్రమే కాకుండా ఔషధ గుణాలు మెండుగానే ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసమే పలు విధాలైన సౌందర్య సాధనాలలో కరివేపాకు పొడిని ఉపయోగిస్తుంటారు.
 
సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా యుక్త వయస్సులో అందరికీ ముఖంపై మొటిమలు వస్తుంటాయి. వాటిని తగ్గించేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ, చేతికందిన క్రీములు వాడుతూ నానా రకాల తంటాలు పడుతుంటారు. అటువంటి వారు వంటకు ఉపయోగించే కరివేపాకును ట్రై చేసి చూడండి. కరివేపాకు చిగుళ్ళు, పసుపు, వేపాకు కలిపి నూరి, మొటిమలకు పెడితే అవి మటుమాయమవుతాయి. అంతేకాకుండా మళ్లీ ముఖంపై మొటిమలు రావు. 
 
ఇటీల కాలంలో వాతావరణ కాలుష్యాల పుణ్యమా అని ముఖంపై, కళ్ల కింద ముడతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే  కరివేపాకు ఆకులని పాలల్లో నూరి అందులో కాస్త ముల్తానిమట్టిని కలిపి ముఖానికి రాస్తే క్రమంగా ముడతలు తగ్గి, ముఖ తేజస్సు పెరుగుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Show comments