Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి ఆకులు, కొబ్బరి పూలు, కొబ్బరి వేర్లు... ఆ రోగాలకు భలే మందు...

కొబ్బరి చెట్టు అనగానే కొబ్బరి నీళ్లు గురించి మాత్రమే మట్లాడుకుంటూంటాం. కానీ కొబ్బరి చెట్టులో ప్రతి ఒక్కటీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. కొబ్బరి నీరు సంగతి ప్రక్కనపెడితే కొబ్బరి ఆకులు, కొబ్బరి పూలు, కొబ్బరి వేర్లు ఔషధాలుగా పనిచేస్తాయట. ఎలాంటి ప్రయోజ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (13:32 IST)
కొబ్బరి చెట్టు అనగానే కొబ్బరి నీళ్లు గురించి మాత్రమే మట్లాడుకుంటూంటాం. కానీ కొబ్బరి చెట్టులో ప్రతి ఒక్కటీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. కొబ్బరి నీరు సంగతి ప్రక్కనపెడితే కొబ్బరి ఆకులు, కొబ్బరి పూలు, కొబ్బరి వేర్లు ఔషధాలుగా పనిచేస్తాయట. ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో చూద్దాం. 
 
* కొబ్బరి ఆకులు
కొబ్బరి ఆకులు కండరాల నొప్పులను వదిలించేందుకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కొబ్బరి చెట్టు మొవ్వు... అంటే చెట్టు పైభాగంలో వుండే తెల్లటి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని బాగా ఉడకబెట్టగా వచ్చిన దానితో కండరాల నొప్పులున్న చోట పూతలా రాస్తే ఆ నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. 
 
* కొబ్బరి పూలు(పూత)
కొబ్బరి పూత లేదా కొబ్బరి పూలను తీసుకుని వాటిని ఉడికించి ఆ నీటిని తాగితే మూత్రపిండాల సంబధిత సమస్యలను అరికడుతుందట. 
 
* కొబ్బరి వేర్లు
కొబ్బరి చెట్టు వేర్లు అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. మూత్ర సంబంధిత సమస్యలతోపాటు పిత్తాశయం సమస్యలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఇందుకోసం కొబ్బరిచెట్టు వేర్లను నాలుగింటిని తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని కాస్త ఉప్పు వేసి నీటిలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చి వడకట్టాలి. ఆ నీటిని తాగితే పిత్తాశయం, మూత్ర సంబంధ వ్యాధులు దరిచేరవని వైద్యులు చెపుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments