Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలకు అద్భుతమైన ఔషధం దాల్చిన చెక్క

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (23:26 IST)
ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలుగా పూర్వం నుంచి వంటింట్లో వాడబడుతున్నాయి. దాల్చిన చెక్క వేడిచేసే స్వభావం కలిగి ఉంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల కడుపుతో వాతం తగ్గుతుంది. అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంది. అజార్తిని పోగొట్టడం, జీర్ణశక్తిని పెంచడంలో దాల్చిన చెక్క పనిచేస్తుంది. కేవలం దాల్చిన చెక్కను ఆహారంలో వేసుకోవడమేగాక బాగా మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు. 
 
వాత వ్యాధులలో కలిగే నొప్పిని ఇది వెంటనే నివారిస్తుంది. కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించి, విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని, దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి. శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
హృద్రోగాలలో దాల్చిన చెక్క తన వంతు సాయం చేసి గుండెను బలంగా ఉంచుతుంది. మైగ్రేన్‌ తలనొప్పి, అంటే పార్స్వ నొప్పిని కూడా దాల్చిన చెక్కను రోజూ తింటే తగ్గించుకోవచ్చు. కనీసం నొప్పి తీవ్రతను అయినా ముందు తగ్గుతుంది. గొంతులో గురగురను పోగొట్టి గొంతును శ్రావ్యంగా ఉంచుతుంది. స్వరం బొంగురుగా వచ్చి స్వరపేటిక వాపు ఉన్నప్పుడు దాల్చిన చెక్కను బుగ్గనపెట్టుకుని అప్పుడప్పుడు వచ్చిన ఊటను మింగుతూ ఉండాలి.
 
దాల్చిన చెక్క రుతుదోషాల్ని కూడా నివారిస్తుంది. స్త్రీలకు ఇది అద్భుతమైన ఔషధం. రుతుశాల అనేది ఎంతోమందికి నరక ప్రాయం. దీనిని దాల్చిన చెక్క వాడడం ద్వారా తగ్గించవచ్చు. అంతేకాకుండా రుతువు సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది కూడా. రుతు రక్తము అధికమైనా దీనిని వాడవచ్చు. దాల్చిన చెక్క స్త్రీల రుతు సమస్యలనే కాకుండా గర్భాశయ దోషాల్ని కూడా అరికడుతుంది. గర్భిణీ స్త్రీ దాన్ని వాడితే సుఖ ప్రసవం అవుతుంది.
 
కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే కళ్ళు కాంతి వంతమవుతుంది. గ్యాస్ ట్రబుల్‌ ఉన్న వ్యక్తులకు దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. కడుపులోనూ, గుండెలలోనూ మంట ఉన్నా, ఎక్కిళ్లు వస్తున్నా దీనిని వాడితే మంచిది. జిగట విరేచనాలు, అమీబియాసిస్‌ వంటి వ్యాధుల్లో దాల్చిన చెక్కను బాగా మెత్తగా దంచి దానిలో కాసిని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ అయ్యేట్లు ఉడకబెట్టి గట్టిపడ్డాక దానిలో కాస్త నెయ్యి, పటిక బెల్లం వేసి కలిపి కుంకుడుకాయంత మాత్రలు చేసుకుని మూడు పూటలా తింటూ ఉండే వ్యాధి తగ్గుతుంది.
 
అంతే కాదు నీళ్ళ విరేచనాలు, అజీర్తి విరేచనాలు కూడా తగ్గుతాయి. విరేచనాలతో పాటుగా వాంతులు ఉన్నప్పటికీ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. పావుసేరు గుమ్మపాలలో రెండు చెంచాల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ త్రాగితే వీర్యవృద్థి కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

తర్వాతి కథనం
Show comments