Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటిక బెల్లం చూర్ణంతో దగ్గుకు చెక్!

వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల దగ్గు వస్తుంది. దగ్గుకు ఏ చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే దీర్ఘకాల వ్యాధిగా మారి ఊపిరితిత్తుల క్షయ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది.

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (09:16 IST)
వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల దగ్గు వస్తుంది. దగ్గుకు ఏ చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే దీర్ఘకాల వ్యాధిగా మారి ఊపిరితిత్తుల క్షయ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కఫం, రక్తంతో పాటు కలిసి వచ్చే దగ్గు. దీన్నే ఆధునిక వైద్యులు దీనినే కాఫ్ అని అంటారు. కఫం లేని దగ్గులన్నింటికీ పాలు, నెయ్యి ఎక్కువగా వాడటం ఉత్తమ చికిత్స. 
 
రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తింటే దగ్గు తగ్గిపోతుంది. రెండు చిటికెల కవిరి చూర్ణాన్ని పెరుగు మీద ఉండే నీటితో కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. ఒక తానికాయ చూర్ణాన్ని చెంచాడు తేనెతో కలిపి తిన్నా దగ్గు తగ్గుతుంది. ఒక చెంచాడు మునగ చెట్టు వేళ్ల రసానికి సమంగా నువ్వుల నూనె, తేనె కలిపి తాగిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది.
 
తమలపాకుల రసాన్ని వెచ్చబెట్టి చల్లారిన తర్వాత సమంగా తేనెకలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ తెల్ల తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫ ప్రకోపం వల్ల కలిగిన దగ్గు తగ్గుతుంది. మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర కలిపి ఒక టీ స్పూన్‌ చొప్పున తింటే కాస వ్యాధి తగ్గుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments