మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖల సందర్శనం వీలుపడదు. ప్రయాణంలో ఇబ్బందులెదురవుతాయి.
వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్య తొలగుతుంది. ఖర్చులు సామాన్యం, సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. వేడుకకు హజరవుతారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలమే. ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. న్యాయ వివాదాలు కొలిక్కివస్తాయి.
సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యలతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.
కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలెదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. నోటీసులు అందుకుంటారు.
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనుకోని సమస్య ఎదురవుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాలు అందుకుంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు.
మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా మెలగాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది.
కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. చిన్ననాటి స్నేహితులు తారసపడతాడు.
మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించానన్న తృప్తి ఉంటుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.