Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:16 IST)
Vyshnav tej movie
ఈ ఏడాది‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా నూత‌న చిత్రం లాంఛ‌నంగా శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై రూపొందుతోంది. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌కొట్ట‌గా, విజ‌య్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు  గిరీశాయకు అందించారు. 
 
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ, ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments