రేపు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:53 IST)
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభ గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంస్మరణ సభ సందర్భంగా సుమారుగా 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇందులో కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు హీరో ప్రభాస్ కూడా సంస్మరణ సభకు హాజరుకానున్నారు. అంతేకాకుండా, కృష్ణంరాజు సంస్మరణ సభ, సమారాధన కార్యక్రమానికి రావాలంటూ మొగల్తూరులోని ప్రతి ఇంటింటికి సమాచారం పంపించారు. 
 
కాగా, అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నగరంలో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ నెల 22, 23 తేదీల్లో దశదిన కర్మక్రతువులు హైదరాబాద్ నగరంలోనే పూర్తిచేశారు. అయితే, కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో సంస్మరణ సంభ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సంస్మరణ సభ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్, కలెక్టర్ పి.ప్రశాంతి, సబ్ కలెక్టర్ విష్ణుచరణ్, తదితరులు మంగళవారం సంస్మరణ సభ జరిగే ప్రాంతాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, మొగల్తూరు పాత కాలువ సమీపంలోని మెగాస్టార్ చిరంజీవి నివాసాన్ని కూడా వారు  సందర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments