Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీను వైట్ల, ప్రకాష్‌రాజ్‌ ఇష్యూపై కమిటీ... భార్యాభర్తల సమస్య లాంటిదే...

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (18:52 IST)
శ్రీను వైట్లకు సిగ్గుందా? నేను చెప్పిన పద్యాన్ని 'ఆగడు' సినిమాల్లో పెట్టుకుంటాడా? అంటూ ప్రకాష్‌రాజ్‌ ఇటీవలే మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందిస్తే... దానికి కౌంటర్‌గా ఆదివారంనాడు శ్రీనువైట్ల.. స్పందించాడు. ఆయనకే సిగ్గులేదంటూ మండిపడ్డాడు. ప్రకాష్‌రాజ్‌ ఆ పద్యాన్ని నాకు డెడికేట్‌ చేశాడు. 
 
దాన్ని నేను ఉపయోగించుకునే హక్కు వుంది. నా అసిస్టెంట్‌ను కొట్టినందుకు నేను ఆయన్ను తీసివేయాల్సి వచ్చింది. పైగా సినిమా మనిషి అయి వుండి 'ఆగడు' సరిగ్గా ఆడటంలేదని చెప్పడం ఆయన అహంకారానికి పరాకాష్ట అంటూ వ్యాఖ్యానించారు. మరలా శ్రీను వైట్ల మాటలపై ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌ చేస్తూ.. కొందరు ఇంకా మారరు అంటూ రాశాడు.
 
అసలు ఇదంతా మూవీ ఆర్టిస్ట్‌అసోసియేషన్‌, చాంబర్‌ తీవ్రంగా పరిగణించింది. కో-ఆర్డినేషన్‌ కమిటీ ఈ విషయాన్ని సర్దుబాటుచేయాలని చూస్తోంది. మురళీమోహన్‌ మాట్లాడుతూ... భార్యభర్తల మధ్య స్పర్థలు లాంటివి సినీ పరిశ్రమలో ఆర్టిస్టుల మధ్య వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని పరిష్కరించడానికి కో-ఆర్డినేషన్‌ కమిటీ వుంది. త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments