Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానపాటలంటే భలే చిరాకు.. దుస్తులు మార్చుకోవాలంటే.. పొదలు, చెట్లే శరణ్యం: శ్రీదేవి

అతిలోకసుందరి శ్రీదేవి అప్పటి షూటింగ్ లొకేషన్లు, విషయాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం మామ్ ప్రమోషన్‌లో శ్రీదేవి బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను శ్రీదేవి వెల్లడిం

Webdunia
బుధవారం, 5 జులై 2017 (11:18 IST)
అతిలోకసుందరి శ్రీదేవి అప్పటి షూటింగ్ లొకేషన్లు, విషయాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం మామ్ ప్రమోషన్‌లో శ్రీదేవి బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను శ్రీదేవి వెల్లడించింది. అప్పట్లో తాను షూటింగ్ లొకేషన్లలో మంచినీరు కూడా ముట్టేదాన్ని కాదని, సరైన వాష్ రూములు కూడా ఉండేవి కాదని శ్రీదేవి చెప్పుకొచ్చింది. తనకు వానలో తడుస్తూ నృత్యం చేసే పాటలంటే భలే చిరాకని.. అలాంటి సీన్లలో నటించిన తర్వాత అనారోగ్యం పాలయ్యేదానినని వెల్లడించింది. 
 
శ్రీదేవి తన మరో కుమార్తె జాన్వి తెరంగేట్రంపై స్పందిస్తూ తనకు చాలా నెర్వస్‌‍గా ఉందని, ఎవరికైనా అలాగే ఉంటుందని పేర్కొంది. కుమార్తెల నుంచి ఫ్యాషన్‌‌కు సంబంధించిన సలహాలను తీసుకుంటానని శ్రీదేవి తెలిపింది. గతంలో తాము షూటింగుల్లో పాల్గొనేటప్పుడు ఇప్పటి వ్యానిటీ వ్యాన్లు లేవని శ్రీదేవి చెప్పింది. కాబట్టి దుస్తులు మార్చుకునేందుకు లొకేషన్లలో ఉన్న పొదలు, చెట్లను ఆశ్రయించే వారమని చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments