Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జురాసిక్ పార్క్' నటుడికి బ్లడ్ కేన్సర్..

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (09:17 IST)
హాలీవుడ్ చిత్రం "జురాసిక్ పార్క్" చిత్రంలో లెగ్రాంట్ పాత్రలో కనిపించిన హాలీవుడ్ నటుడు శామ్ నీల్‌ అనారోగ్యంబారినపడ్డారు. ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. గత 1993లో వచ్చిన జురాసిక్ పార్క్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన విషయం తెల్సిందే.
 
ఆ తర్వాత ఈ 90 ఏళ్ల కాలంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆరు సీక్వెల్స్ వచ్చాయి. గత ఏడాది ఆరో సీక్వెల్ 'జురాసిక్ వరల్డ్ డొమిని విడుదలైంది. ఇందులో లెగ్రాంట్ పాత్రను పోషించిన శామ్ నీల్ తనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు ఇటీవల వెల్లడించారు. 'జురాసిక్ వరల్డ్ డొమినియన్' పబ్లిసిటీ టూర్ ఉన్నప్పుడు ఈ వ్యాధి విషయం తనకు తెలిసిందనీ, ప్రస్తుతం మూడో దశలో ఉందనీ ఆయన వెల్లడించారు.
 
'డాక్టర్లు వ్యాధి విషయం చెప్పగానే ఏం చెయ్యాలో మొదట నాకు తోచలేదు. అయితే ఏదో ఒకటి చేయాలి అని మాత్రం అనిపించి, నా కథనే పేపర్ మీద పెడితే బాగుంటుంది కదా అనుకున్నాను.. అందుకే నాకు కీమో థెరపి జరుగుతున్నప్పుడు 'డిడ్ ఐ ఎవ్వర్ టెల్ యూ దీస్?' పుస్తక రచన ప్రారంభించాను' అని శామ్ చెప్పారు. ఈ పుస్తకం వచ్చేవారం విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments