Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా క్వాంటికో సిరీస్ ఆగిపోయిందా? టీఆర్పీ కారణమా..? ట్రంప్‌పై కామెంట్స్‌కు లింకుందా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే భయం లేదని.. తాను భారతీయురాలని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. ఇంకా వీసా రద్దుపై కూడా ప్రియాంక చోప్

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:39 IST)
గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే భయం లేదని.. తాను భారతీయురాలని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. ఇంకా వీసా రద్దుపై కూడా ప్రియాంక చోప్రా నోరెత్తింది. అది సరికాదని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్‌ టీవీ సిరీస్‌ క్వాంటికో నిలిచిపోతోందా? అవుననే అంటున్నాయి హాలీవుడ్‌ వర్గాలు.
 
ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో రెండో సీజన్‌లో నటిస్తోంది. అయితే మొదటి సీజన్‌కి వచ్చినంత వ్యూయర్‌షిప్‌ రెండో సీజన్‌కి రావడంలేదట. ఈ విషయాన్ని ఇంతకుముందు క్వాంటికో ప్రసారమయ్యే ఏబీసీ చానెల్‌ కూడా తెలిపింది. అప్పట్లో వ్యూయర్‌షిప్‌మరీ 0.76కి పడిపోయినందుకు ఆదివారం ప్రసారమయ్యే షోని సోమవారానికి మార్చినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. కానీ ఇప్పుడు ఈ మార్పు కూడా కలిసిరాలేదు. 
 
ఇక రెండో సీజన్‌ వ్యూయర్‌షిప్‌ ఇంతకంటే పుంజుకునే అవకాశాలు కన్పించకపోవడంతో షోని నిలిపివేయాలని నిర్మాణ బృందం నిర్ణయించుకుందట. దీంతో ప్రియాంక చోప్రా తలపై చేయిపెట్టేసుకుందట. ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో పుంజుకుంటున్న తనకు క్వాంటికో ప్రసారం ఆగిపోవడం గట్టి దెబ్బేనని బాధపడుతోందట. అయితే ఈ సీరియల్ ఆగిపోవడానికి-టీవీ రేటింగ్ పడిపోవడానికి ట్రంప్‌పై ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించడానికి మధ్య లింకుండి వుంటుందని సినీ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)

ఆన్‌లైన్‌లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?

విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments