మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ముఫాసాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన పోస్టర్‌ను నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గ్రాండ్ మీడియా ఈవెంట్ లో లాంచ్ చేశారు. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్, టిమోన్ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.
నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని మాట్లాడుతూ.. డిస్నీ టీం చాలా శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ ని చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డబ్ చేయడం ఒక ఛాలెంజ్, డిస్నీ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి అద్భుతంగా తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేష్ బాబు గారు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది'అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. మన వాయిస్ డిస్నీ లైబ్రెరీలో వుండడం అనేది గ్రేట్ ఎచీవ్మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్న క్యారెక్టర్ చేశాను. ఓ సీన్ లో మహేష్ గారు నాభుజంపై చెయ్యి వేస్తూ మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తర్వాత సరిలేరు నికెవ్వరు లో ఒక క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఆయనతో కలసి టాకా అనే క్యారెక్టర్ కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ లో వుండటం వలన యానిమల్స్ ని చూస్తే తమ్ముడు అన్న అనే ఫీలింగ్ కలిగేది(నవ్వుతూ). ముఫాసా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.మహేష్ గారి పంచస్ అద్భుతంగా పేలాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.
యాక్టర్ అలీ మాట్లాడుతూ.. ది లయన్ కింగ్ సినిమా మన అందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మహేష్ గారు ముఫాసా కి డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ రెండు వందల సంవత్సరాలు వుండిపోతుంది. ఒక యాక్టర్ కి కావాల్సినది ఇదే. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది' అన్నారు.