Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లయన్'' కోసం దేవ్ పటేల్ గెటప్ ఛేంజ్.. మళ్లీ ఆస్కార్ అవార్డ్ ఖాయమేనట.. (ట్రైలర్)

ఆస్కార్ అవార్డుల పంట పండించిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా సంగతి గురించి అందరికీ బాగా తెలుసు. ఆ సినిమాను అంత సులభంగా మర్చిపోరు. దేవ్ పటేల్ లవ్ గురించి అవార్డుల గురించి దేశంలో ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్ప

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (09:36 IST)
ఆస్కార్ అవార్డుల పంట పండించిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా సంగతి గురించి అందరికీ బాగా తెలుసు. ఆ సినిమాను అంత సులభంగా మర్చిపోరు. దేవ్ పటేల్ లవ్ గురించి అవార్డుల గురించి దేశంలో ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకున్న వారే. అయితే ఈ సినిమాకు తర్వాత చాలా బ్రేక్ ఇచ్చిన దేవ్ పటేల్ మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. రానున్న సినిమా కోసం తన గెటప్‌ను పూర్తిగా మార్చుకోనున్నట్లు బ్రిటన్ ప్రముఖ నటుడు, స్లమ్ డాగ్ మిలినీయర్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటుడు దేవ్ పటేల్ చెప్పాడు.
 
లయన్ చిత్రం కోసం తన జుట్టు, గడ్డం పెంచానని, ఈ చిత్రంలో పెద్దవాడిలా కనిపిస్తానని దేవ్ పటేల్ వెల్లడించాడు. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా తనను చూస్తారని, ఆ మేరకు దర్శకుడు తనను మార్చాడని చెప్పారు. బ్రిటన్ దర్శకుడు గార్త్ డావిస్ దర్శకత్వంలో లయన్ అనే చిత్రంలో దేవ్ పటేల్ నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి దేవ్ పటేల్ మాట్లాడుతూ.. కొత్త  గెటప్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాడు. 
 
ఈ సినిమా కోసం పూర్తి మనిషిలా మారాను. వచ్చే ఎనిమిది నెలలపాటు ఎలాంటి డేట్లు ఇవ్వొద్దని వెంటనే తన వ్యక్తిగత మేనేజర్ వద్ద చెప్పినట్లు తెలిపాడు. లయన్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. ప్రతిసారి ఇలాంటివి రావంటూ దేవ్ వెల్లడించాడు. ఈ సినిమా నవంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
 
ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న లయన్‌... ఇండియాలో చిన్నతనంలో తన తల్లికి దూరమైన ఓ కుర్రాడు.. అనుకోకుండా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే పెరిగి.. పాతికేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.  ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు కూడా గ్యారెంటీ అంటున్నారు సినీ పండితులు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments