Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతున్నా: జాకీ చాన్.. ఈయన కొడుకు ఏం చేశాడు..!

Webdunia
బుధవారం, 7 జనవరి 2015 (05:32 IST)
‘నా కొడుకు చేసింది తప్పే.. దానికి నేను సిగ్గుపడుతున్నా.. ఆయనను విడిపించడానికి ఎటువంటి రాజకీయ పలుకుబడి వాడుకోను.. ఏదోక రోజున నా కొడుకు కూడా నాలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కర్త అవుతారు’.. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది సాధాసీదా వ్యక్తి కాదు. జాకీ చాన్... ప్రపంచ ప్రఖ్యాత హీరో. ఇలా సిగ్గు పడాల్సినంతగా ఆయన కొడుకు ఏం చేశాడు? రండి తెలుసుకుందాం.. 
 
గాయకుడు, నటుడు జేసీ చాన్(32) ప్రముఖ హీరో జాకీ చాన్ కుమారుడు. బీజింగ్ పోలీసులు గత ఏడాది ఆగస్ట్‌ 14న జేసీచాన్, తైవాన్ సినీ నటుడు కో చెంగ్ తుంగ్ తో పాటు మరి కొంతమందిని  అరెస్ట్ చేశారు. జేసీ, కోలు తాము మరిజువానా(మాదకద్రవ్యం) వినియోగించినట్లు అంగీకరించారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. మాదకద్రవ్యాల కేసులో కఠిన శిక్షలుంటాయి. అందులో భాగంగా ఈ నెల 6న బహిరంగంగా విచారించనున్నట్లు బీజింగ్‌ కోర్టు మంగళవారం ప్రకటించింది.  
 
జాకీ చాన్ పేరు వినని మార్షల్‌ ఆర్ట్స్‌ అభిమానులు దాదాపుగా ఉండరు. వారేంటి సామాన్య సినిమా అభిమానులు కూడా ఆయన నటనకు ముగ్దులవుతారు. వంద సినిమాలకు పైగా నటించిన ఆయన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైనాలో  ప్రచారకర్తగా వ్యవహరించారు. చివరకు ఆయన కొడుకే మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కోవడంతో ఆయన ఇలా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగానే తన కొడుకు కోసం ఎటువంటి రాజకీయ పలుకుబడి వినియోగించబోనని కుండబద్ధలు కొట్టారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments