Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం సినిమా భారీ సక్సెస్: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ''ఇట్'' (Trailer)

హాలీవుడ్ కొత్త థ్రిల్లర్ ''ఇట్'' ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డుల‌ను కొల్లగొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 117.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. అమెరికా

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:18 IST)
హాలీవుడ్ కొత్త థ్రిల్లర్ ''ఇట్'' ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డుల‌ను కొల్లగొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 117.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్కువ మొత్తంలో ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు సాధించిన మొద‌టి హార్ర‌ర్ చిత్రంగా ''ఇట్‌'' నిలిచింది. అమెరికాను ఇటీవ‌ల రెండు హ‌రికేన్లు దెబ్బ‌తీసినా.. ఇట్ మాత్రం ఆ దేశ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తున్న‌ది.
 
ప్ర‌ముఖ ఆంగ్ల ర‌చ‌యిత స్టీఫెన్ కింగ్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లలోనే కాకుండా భారత మార్కెట్లోనూ.. కోట్లాది రూపాయలను వసూలు చేస్తోంది. ఇట్ సినిమాకు ఆండీ మూషెట్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఇట్ సినిమా కేవ‌లం ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఇట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల వ‌సూల్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
రోటెన్ ట‌మోటాస్ సంస్థ ఈ ఫిల్మ్‌కు త‌న రివ్వ్యూలో 86 శాతం క్రెడిట్ ఇచ్చింది. అమెరికా వీకెండ్‌లో 123 మిలియ‌న్ల డాల‌ర్లు వ‌సూల్ చేసిన ఇట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ది. అంతేకాదు ఇటీవ‌ల హార‌ర్ స‌బ్జెక్ట్‌తో వ‌స్తున్న చిత్రాల్లో ఇట్ ఒక్క‌టే భారీ స‌క్సెస్ కొట్టింది. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, న్యూ లైన్ సినిమా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments