Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (11:34 IST)
భారత డిజైనర్లు హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్నారు. జెండాయా, సెలెనా గోమెజ్, గిగి హెడిడ్ వంటి అంతర్జాతీయ తారామణుల బాటలోనే ప్రముఖ హలీవుడ్ నటి బ్లేక్ లైవ్లీ కూడా భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన వస్త్రాలతో తళుక్కున మెరిశారు. హాలీవుడ్ తారలు వరుసగా అదిరిపోయే వస్త్రాలను ధరించడం భారతీయ డిజైనర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
ప్రస్తుతం తాను నటిస్తున్న 'అనదర్ సింపుల్ ఫేవర్' సినిమా ప్రచారం కార్యక్రమాల్లో బ్లేక్ లైవ్లీ చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ఆమె రాహుల్ మిశ్రా స్ప్రింగ్ 2025 కౌచర్ కలెక్షన్‌కు చెందిన ఒక అద్భుతమైన నల్లటి పెన్సిల్ స్కర్టును ధరించారు. సిటీస్కేప్ పేరుతో రూపొందించిన ఈ స్కర్టుపై సున్నితమైన చేతి ఎంబ్రాయిడరీ రాహుల్ మిశ్రా ప్రత్యేకత అయిన 3డీ అలంకరణలు ఉన్నాయి. 
 
ఈ స్కర్టుపై స్టైలింగ్‌ను బ్లేక్ లైవ్లీ స్వయంగా చేసుకోవడం విశేషం. స్కర్టుపై ఉన్న కళాత్మక ఎంబ్రాయిడరీ పనితనం స్పష్టంగా కనిపించేలా, దానికి జతగా ఆమె చాలా సింపుల్‌గా ఉండే బ్లాక్ ట్యాంకు టాప్‌ను ఎంచుకున్నారు. ఈ లుక్‌తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments