Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేట‌గాడే వేటాడ‌బ‌డితే..! ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్

డీవీ
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:53 IST)
The Last dance
సోనీ పిక్చ‌ర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ వారు సంయుక్తంగా రూపొందించిన చిత్రం వెన‌మ్. ఈ మూవీ సిరీస్ లో మూడ‌వ భాగం వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఈ అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన వెనమ్ మూవీ సిరీస్ లో మొదటి, రెండు భాగాలు వ‌ర‌ల్డ్ వైడ్ గా మూవీ ల‌వ‌ర్స్ ని వీప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో రాబోతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్లుగానే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. తాజాగా విడుద‌లైన వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్ కూడా ప్రేక్ష‌కుల్నీ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ టామ్ హార్డీ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమా సిరీస్ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్ష‌న్ వంటి సినిమాల్లో న‌టించి టామ్ హార్డీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టామ్ హార్డీ న‌ట‌న‌తో పాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ స‌న్నివేశాలు వెన‌మ్ - ది లాస్ట్ డాన్స్ లో హైల‌ట్ గా నిల‌వబోతున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్ వారు ఎక్స్ క్లూసీవ్ గా ఇండియాలో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాషల్లో భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. వెనమ్ - ది లాస్ట్ డాన్స్ 3డి తో పాటు ఐమాక్స్ 3డి వెర్ష‌న్ లో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments