Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ మహిళా స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఎక్కడ?

సినిమా షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తరహా ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం సహజంగా జరుగుతుంది. తాజాగా జరిగిన ప్రమాదంలో మహిళా స్టంట్ మాస్టర్ మృతి చెందారు. తాజాగా వెలుగులోకి

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (12:00 IST)
సినిమా షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తరహా ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం సహజంగా జరుగుతుంది. తాజాగా జరిగిన ప్రమాదంలో మహిళా స్టంట్ మాస్టర్ మృతి చెందారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటిష్ కొలంబియాలోని వాన్ కవర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగిన హాలీవుడ్ మూవీ ‘డెడ్ పూల్’ పార్ట్ 2 షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా స్టంట్ మాస్టర్ ఎస్.జె.హర్రిస్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వేగంగా బైక్ నడుపుతూ అక్కడ ఉన్న సిగ్నల్‌ను క్రాస్ చేసిన ఆమె, అక్కడే ఉన్న మలుపులను గమనించలేకపోయింది. దీంతో, పక్కనే ఉన్న షా టవర్‌లోని ఓ షాపింగ్ మాల్ తలుపులను బలంగా ఢీకొట్టిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
కాగా, ఈ సంఘటనపై ఈ చిత్ర నటుడు ర్యాన్ రెనాల్డ్స్ విషాదం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ‘ఈ రోజు, డెడ్ పూల్ షూటింగ్‌లో చిత్ర యూనిట్‌లోని ఒకరిని మేము పోగొట్టుకున్న ఇది చాలా బాధాకరమైన రోజు. ఈ సంఘటనతో మా గుండెలు పగిలిపోయాయి.. అప్పటిదాకా మాతో నవ్వుతూ ఉన్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు విడిచింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments