భయపెడుతున్న "క్రాల్" - మొసళ్ళతో మహిళ పోరాటం (CRAWL Trailer)

Webdunia
ఆదివారం, 5 మే 2019 (11:17 IST)
హాలీవుడ్ అంటేనే జంతువుల నేపథ్యంలో వచ్చే చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా పారామౌంట్ పిక్చర్స్ క్రాల్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించింది. మొస‌ళ్ళ నేప‌థ్యంతో అలెగ్జాండ్రి అజా "క్రాల్" అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. 
 
ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ఇళ్ళ‌న్ని నీటిలో మునుగుతాయి. వ‌ర‌ద‌లతో మొస‌ళ్ళు కూడా ఇళ్ళ‌ల్లోకి చేరుతాయి. అయితే ఓ ఇంట్లో మ‌హిళ మొస‌ళ్ళ మ‌ధ్య ఇరుక్కుపోతుంది. ఆమెని కాప‌డ‌డానికి వ‌చ్చిన వారంద‌రు మొస‌ళ్ళ‌కి ఆహారం అయిపోతుంటారు. 
 
ఈ పరిస్థితుల్లో మొస‌ళ్ళ‌ బారి నుంచి ఆ మహిళ ఒక్కరే ఎలా సురక్షితంగా బ‌య‌ట‌ప‌డింద‌నే ఈ చిత్ర కథ. ఎంతో ఉత్కంఠ‌ని రేకెత్తించ‌నున్న ఈ సినిమాలో క్రెయిగ్‌ జె ఫ్లోరిస్‌, శామ్‌ రైమీలు చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జులై 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌ను 99 లక్షల మంది వీక్షించారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments