Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదాస్పదమైన బీబీసీ సీరియల్‌.. బుల్లితెర ప్రేక్షకుల ఆగ్రహం..ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2016 (11:22 IST)
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బీబీసీ ఛానెల్లో తాజాగా ప్రసారం అవుతున్న ఓ టీవీ సీరియల్ వివాదాస్పదంగా మారింది. బీబీసీలో ప్రసారమవుతోన్న ఈ సీరియల్ కామాంధులను కనువిందు చేస్తోంది. ఈ సీరియల్ నిండా బూతులు సీన్లు, పోర్న్ సీన్లు ఉండటంతో వివాదస్పదమైంది. కుటుంబ వీక్షకులు మాత్రం ఎంతో చిరాకు పడుతున్నారు. బుల్లి తెరపై ఇలాంటివి ప్రసారం కావడం వీల్లేదని, బ్యాన్ చేయాలని బ్రిటన్ ప్రజలు ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంతకీ ఆ సీరియల్ ఏంటో తెలుసా..? 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా 'వర్సల్లెస్' అనే సీరియల్ ని రూపొందిస్తున్నారు. లూయిస్ -14 కామలోలుడన్న విషయం విదితమే. ఆ.. కళను తెరపై చిత్రీకరించడానికి దాదాపు 21 మిలియన్ పౌండ్లు(రూ. 200 కోట్లు) ఖర్చు పెట్టారు. కథానుసారం సీరియల్లో కొన్ని సెక్స్ సీన్లు, నగ్న దృశ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. 
 
శృంగార దృశ్యాలని నిండుగా నింపుకొన్న ఈ సీరియల్ బీబీసీకి మంచి కలెక్షన్స్ ని తెచ్చిపెడుతోంది. చారిత్రక కథనం పేరుతో సెక్స్ సీన్లు తెరకెక్కించడాన్ని బ్రిటన్ ఎంపీలు, కుటుంబ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సీరియల్ పై ఫ్రాన్స్ లోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. మరి ఈ సీరియల్ పై వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు