Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పెక్టర్‌'లో ఘాటు ముద్దుసీన్లకు సెన్సార్ కత్తెర.. భారతీయ ప్రేక్షకులు అంత ఘాటును తట్టుకోలేరట!

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (11:15 IST)
బాండ్. జేమ్స్ బాండ్.. జేమ్స్ బాండ్ 007. దీనికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఏం చేసినా బ్రిటన్‌లో చెల్లుబాటవుతుంది. కానీ భారత సెన్సార్ బోర్డు ముందు ఆయన ఆటలు చెల్లవ్. అందుకే జేమ్స్ బాండ్ 'స్పెక్టర్' జోరుకు భారతీయ సెన్సార్ బోర్డు బ్రేకేసింది. ఆ సినిమాలో 007 హాట్ సీన్లకు సీబీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డానియల్ క్రేగ్ నటించిన బాండ్ సినిమా 'స్పెక్టర్‌'లో ఉన్న ముద్దు దృశ్యాలను నిర్ధాక్షిణ్యంగా సగానికి సగం తగ్గించింది. 
 
జేమ్స్ బాండ్ సీక్వెల్ 'స్పెక్టర్' గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఆ మూవీలో హీరో డానియల్ క్రేగ్, హీరోయిన్ మోనికా బెలుస్కీ మధ్య హాట్ కిస్సింగ్ సీన్లున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాల కోసం వీరిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. ఫలితంగా కిక్కెక్కించే ముద్దు సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే అంత డోస్ భారతీయ సినీ ప్రేక్షకులకు అవసరం లేదని మన సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. 
 
గాఢంగా ముద్దుపెట్టుకునే దృశ్యాలు అతి సుదీర్ఘంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఆ సీన్లను 50 శాతానికి తగ్గించినట్లు బోర్డు పేర్కొంది. 51 ఏళ్ల బెలుస్కీ 'స్పెక్టర్‌'లో హాట్ సన్నివేశాలను రసవత్తరంగా పండించింది. ఇటలీకి చెందిన ఈ హాలీవుడ్ భామ ఈ సినిమాలో మాఫియా డాన్ భార్యగా నటించింది. ఓ బెడ్ రూమ్ సీన్‌లో ఇద్దరూ ముద్దుల్లో తేలిపోతారు. ఆ సన్నివేశంలో చాలా గాఢంగా తమ ప్రేమను వ్యక్తపరిచారట. వామ్మో ఈ ముద్దులు మనకొద్దంటూ సెన్సార్ బోర్డు ఆ డెడ్లీ కిస్సులను తొలగించేసిందట. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments