Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు తప్పు చేయరు.. ఆంక్షలు అవసరం లేదు: బ్రాడ్ పిట్

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (17:49 IST)
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ తన వ్యక్తిగత విషయాలను టెలిగ్రాఫ్ మ్యాగజైన్‌తో పంచుకున్నారు. తన కుమారులను క్రమశిక్షణతో పెంచుతానని.. అయితే అమ్మాయిల విషయంలో వారు తప్పుచేయరని నమ్ముతానని చెప్పుకొచ్చాడు. కొడుకుల విషయంలో క్రమశిక్షణ పాటించే బ్రాడ్, కూతుళ్ల విషయంలో మాత్రం అలా ఉండటానికి ఇష్టపడనని.. అమ్మాయిలు తప్పు చేయరు కాబట్టి వారిపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని బ్రాడ్ పిట్ అన్నారు. 
 
తండ్రిగా అమ్మాయిలకు ఈ ప్రపంచానికి తెలియజేస్తానని.. వారి జీవితంలో వారు చేయాలనుకునే పనికి సాయం చేస్తానని, వారికి అవకాశాలు అందేలా చూస్తానని చెప్పారు. అయితే తప్పుదారిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా వారిస్తానని వెల్లడించారు. తండ్రిగా ఇవే తన బాధ్యతన్నారు. తన సతీమణి ఏంజెలీనా జోలి, తాను డజను పిల్లలు కావాలనుకున్నామని... ఇప్పటికే ఇల్లంతా పిల్లలతో సందడిగా మారిపోవడంతో ఆరుగురితో సరిపెట్టామని వివరించాడు.
 
51 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్కు ఆరుగురు సంతానం. మడాక్స్ (14), పాక్స్ (11), జహర(10), ఫిలొహ్(9), నాక్స్, వివిన్ని అనే ఏడేళ్ల కవలలు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలిల పిల్లలు కావడం గమనార్హం. ఇంకా బ్రాడ్ పిట్ మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎంతో ప్రేమ ఉంది. నిత్యమూ యుద్ధం జరుగుతుంటుంది. అయినా అలాంటి జీవితంలో ఎంతో ఆనందం ఉందని చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments