Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడావు మార్న్ యాంగ్.. ఫేస్ బుక్ లైవ్ నిజాలు.. టీనేజ్‌లో అత్యాచారం.. తెలిసినవారే?

మహిళలపై దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ అరాచకాలు జరుగుతూనే వున్నాయి. ఆస్ట్రేలియా నల్ల కలుల అడావు మార్న్ యాంగ్ ఫేస్ బుక్‌ లైవ్‌లో చెప్పిన నిజాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మిస్ వరల్డ్ ఫైనలిస్ట్ అయిన ఈ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:11 IST)
మహిళలపై దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ అరాచకాలు జరుగుతూనే వున్నాయి. ఆస్ట్రేలియా నల్ల కలుల అడావు మార్న్ యాంగ్ ఫేస్ బుక్‌ లైవ్‌లో చెప్పిన నిజాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మిస్ వరల్డ్ ఫైనలిస్ట్ అయిన ఈమె.. ఫేస్ బుక్ లైవ్‌లో షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

తన టీనేజ్ వయసులో అత్యాచారానికి గురయ్యానని తెలిపింది. దాదాపు గంటపాటు తన అభిమానులతో మాట్లాడుతూ తానెదుర్కొన్న భయానక ఘటనల గురించి పూస గుచ్చినట్టు వెల్లడించింది. సౌత్ సూడాన్‌లో పుట్టి, ఆస్ట్రేలియాలో పెరిగిన ఈ 22 ఏళ్ల బ్యూటీ క్వీన్, ఇకపై అమ్మాయిల రక్షణకు తనవంతు పాత్రను పోషిస్తానని తెలిపింది.
 
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అడిలైడ్‌లో తనకు తెలిసిన వ్యక్తే లైంగికంగా వేధించాడని తెలిపింది. అప్పుడు ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయానని చెప్పుకొచ్చింది. ఇంకా లైవ్‌లోనే కన్నీరు పెట్టుకుంది. ఆ ఘటనలను గుర్తు చేసుకుని ఇప్పటికే బహిరంగంగా మాట్లాడేందుకు తాను వెనుకడుగు వేయట్లేదని తెలిపింది. 
 
తన స్నేహితులే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని.. తన బాయ్‌ఫ్రెండ్ అక్కడ నుంచి కాపాడమని ఎంత వేడుకున్నా.. వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తెలిసిన వారే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని.. ఆ బాధను అనుభవించలేకపోయానని, కళ్లు తెరచి చూడలేకపోయానని, నోటితో మాట్లాడలేకపోయానని చెప్పుకొచ్చింది. నరకం అనుభవించానని తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం