Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధుల ఆగ్రహానికి గురైన హాలీవుడు బ్యూటీ... ఏంజెలీనా జోలీ వీపుపై టాటూ..!

Webdunia
ఆదివారం, 17 మే 2015 (15:50 IST)
హాలీవుడ్ అందాల రాశి ఏంజెలీనా జోలీ. ఇప్పుడీ బ్యూటీ బౌద్ధుల ఆగ్రహానికి గురైంది. ఇందుకు కారణం ఆమె వీపుపై వేయించుకున్న ఓ టాటూనే. పురాతన్ ఖ్మేర్ లిపిలో ఉన్న ఆ టాటూ ఎంతో పవిత్రమైనదని, జోలీ దాన్ని అగౌరవపరిచారని థాయ్ లాండ్ లోని బౌద్ధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
2003లో ఆమె థాయ్ టాటూ మాస్టర్‌నూ కాంపాయ్‌తో ఈ టాటూ వేయించుకున్నారు. అయితే, థాయ్ సంస్కృతి ప్రకారం మానవ దేహంలో తల మాత్రమే పవిత్రమైనది. దాంతో, మిగతా భాగాలపై మతపరమైన టాటూలు వేయించుకోవడం, విశ్వాసాలను కించపరచడమేనని అక్కడి వారు భావిస్తారు. 
 
ఏంజెలీనా జోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టార్ కావడంతో, ఆమెను చూసి ఎందరో వేలంవెర్రిగా ఆ టాటూను వేయించుకునేందుకు ఎగబడతారని బౌద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ టాటూలో ఉన్న వాక్యాల మహత్మ్యం పాశ్చాత్యులకు అర్థం కావడంలేదని వారంటున్నారు. కనుక ఇటువంటి టాటూలపై నిషేధం విధించాలని వారు కోరుతున్నారు. బుద్ధుడిని టాటూల రూపంలో, అలంకరణల రూపంలో ఉపయోగించడం తప్పు అంటూ రాజధాని బ్యాంకాక్‌లో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అక్కడ పెద్ద దుమారేన్నే రేపుతోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments