Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు మరో హాలీవుడ్ నటుడు మృతి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:25 IST)
కరోనా వైరస్ సోకి మరో హాలీవుడ్ క్యారెక్టర్ నటుడు కన్నుమూశారు. ఈయన పేరు అలెన్ గార్ఫిల్డ్. వయసు 80 యేళ్లు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాలీవుడ్ నటుడుగా గుర్తింపుపొందాడు. ఈయనకు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో పాలయ్యాడు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన గార్ఫిల్డ్ తాజాగా కన్నుమూశాడు.

ఈ విషయాన్ని నటి రోనీ బ్లాక్లే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గొప్ప నటుడు, నాష్‌విల్లెలో నాకు భర్తగా నటించిన అలెన్ కరోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
 
కాగా, న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది శ్రీమంతులు ఇపుడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ న్యూయార్క్ నగరానికి చెందిన గార్ఫిల్డ్... న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు.
 
ఆ తర్వాత తొలిసారి 1968లో వ‌చ్చిన 69వ చిత్రంతో తెరంగేట్రం చేశారు. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments